తన వాటాను అమ్మనున్న ఎల్ఐసీ
16-06-2009
ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ తన మ్యూచ్యువల్ ఫండ్‌లోని 18.3శాతాన్ని జపాన్‌లోని ప్రముఖ ఆర్థిక సంస్థ అయిన నోమూరా కంపెనీకి అమ్మనుంది. ఇది దాదాపు రూ. 138 కోట్లుగా ఉంది. ఎల్ఐసీ, నోమూరా సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు ఎల్ఐసీ మ్యూచ్యువల్ ఫండ్‌లోని తన 38.3శాతం వాటాలోంచి దాదాపు 18.3శాతం భాగస్వామ్యాన్ని జపాన్‌కు చెందిన నోమూరా సంస్థకు అమ్మనున్నట్లు ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ మేనేజింగ్ డైరెక్టర్, ప్రధాన కార్యనిర్వహణాధికారి ఆర్.ఆర్.నాయర్ తెలిపారు. ఈ సందర్భంగా తమ సంస్థకు రూ. 138 కోట్లు అందే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఇదిలావుండగా ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలో భాగస్వామిగానున్న జీఐసీ హౌసింగ్ ఫైనాన్స్ సంస్థకూడా ఎల్ఐసీఎమ్ఎఫ్‌లోని తన వాటా 11.2శాతాన్ని అమ్మేందుకు సిద్ధపడినట్లు సమాచారం.
- .....................
రికార్డు సాధించిన రిలయన్స్ ఎమ్ఎఫ్ మంగళవారం, 2 జూన్ 2009
అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ మ్యూచ్యువల్ ఫండ్ కంపెనీ ఒక లక్ష కోట్ల రూపాయలకు పైగా వ్యాపారాన్ని కొనసాగించింది. దీంతో భారతీయ అగ్రగామి సంస్థలలో ఆ కంపెనీ రికార్డును సాధించింది. మ్యూచ్యువల్ ఫండ్ రంగంలో రిలయన్స్ సంస్థ ఒక లక్ష కోట్ల రూపాయల వ్యాపారం చేసిందని, దీంతో తమ కంపెనీ దేశంలోనే ప్రథమంగా నిలిచిందని రిలయన్స్ మ్యూచ్యువల్ ఫండ్ సంస్థకు చెందిన ప్రధాన కార్యనిర్వహణాధికారి(సీఈఓ) సందీప్ సిక్కా తెలిపారు.రిలయన్స్ ఎమ్ఎఫ్ కంపెనీ మే నెలలో దాదాపు 13శాతం వృద్ధి జరిగిందని దీంతో ఏయూఎమ్ 100000 కోట్ల రూపాయలకు చేరుకుంది. ఇది ఏప్రిల్ నెల చివరికి 88387.98 కోట్ల రూపాయలుగా ఉండిందని కంపెనీ వర్గాలు తెలిపాయి.
- మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి ?
మదుపరుల నుండి పెట్టుబడులను సమీకరించి వారి ధనానినికి పూచి దారుని గా వివిధ సెక్యూరిటీ ల లో పెట్టుబడి సంస్థలని మ్యూచువల్ ఫండ్స్ అని స్థూలం గా చెప్పుకొనవచ్చు.మ్యూచువల్ ఫండ్ ల ను ప్రవేశ పెట్టె సంస్థ ని sponser కంపెనీ అని అంటారు. మూల ధనాన్ని పెట్టుబడి పెట్టిన మదుపరులను మ్యూచువల్ ఫండ్స్ భాషలో యూనిట్ దారునిగా వ్యవహరిస్తారు. పెట్టుపడి ని లెక్కించేందుకు వాడే కనిష్ట వి లువను యూనిట్ అంటారు. సాధారణం గా ఇది రూ. 10/- ముఖవిలువగా ఉంటుంది. ఫండ్ లను నైపుణ్యం గల మేనేజర్లు తమ అనుభవం తో షేర్లు, డెట్ సెక్యూరిటీ లు ,మని మార్కెట్ సెక్యూరిటీ ల లో పెట్టుబడి పెట్టి, వాటి పై వచ్చిన లాభాల లో ఖర్చులను మినహాయించుకొని మిగిలిన ధనాన్ని యూనిట్ దారులకు లాభాల రూపం లో అందించటం మ్యూచువల్ ఫండ్ ముఖ్య ఉద్దేశం. ఐతే యూనిట్ దారులకు తమ వంతూ లాభ లే కాదు, నష్టాల లో కూడా వాటా భరించాల్సి వుంటుంది. ఈ ప్రక్రియ సవ్యం గా నడిపించేందుకు sponser కంపెనీ ఒక అసెట్ మేనేజ్ మెంట్ కంపెనీలు (ASSET MANAGEMENT COMPANY -AMC) ని స్థాపిస్తుంది. ముందుగా స్పాన్ సర్ కంపెనీ తాము ఆరంభించబోయే మ్యూచువల్ ఫండ్ ని, AMC ని, SEBI లో రిజిస్టర్ చేసుకోవడం అనివార్యం. AMC ముందుగాజరుపుకున్న అగ్రిమెంట్ ప్రకారం , SEBI నియమావళికి అనుగుణంగా ధనాన్ని పెట్టుబడి పెడుతుంది. పెట్టుపడులకు భద్రత గా ఒక కష్టో డియన్ని, మార్పిడులకు ఒక రిజి స్త్రార్ ని నియమిస్తుంది. మ్యూచువల్ ఫండ్ ల లో పెట్టుపడులను స్వీకరించేందుకు distributors ని నియమిస్తుంది. AMC లు జరిపిన పెట్టుపడుల వలన , ఇంక తమ వద్ద గల నిలువ మొత్తం ఫండ్ లో గల యూనిట్ల తో భాగిస్తే వచ్చే విలువను నెట్ అసెట్ వాల్యు ( NET ASSET VALUE -NAV) అని అంటారు. ఫండ్ పని తీరు ఈ NAV తో బేరీజు వేస్తారు. NAV విలువ ఎక్కువగా ఉంటే ఆ ఫండ్ పని తీరు చక్కగా ఉందని స్థూలంగా చెప్పవచ్చు.