- వేల్యూ రీసెర్చ్ రేటింగ్స్‌లో బిర్లా సన్‌లైఫ్‌కు అగ్రస్థానం
- డివిడెండ్లు ప్రకటించిన రిలయన్స్ మ్యూచువల్ ఫండ్
అనిల్ దీరూభాయ్ అంబానీ గ్రూపు రిలయన్స్ మ్యూచువల్ ఫండ్ రెండు రకాల ఫండ్ స్కీముల్లో డివిడెండ్‌ను ప్రకటించింది. రిలయన్స్ మీడియా అండ్ ఎంటర్‌టెయిన్‌మెంట్ ఫండ్‌లో రికార్డు తేదీ సెప్టెంబర్ 18 నాటికి 15 శాతం డివిడెండ్‌ను, రిలయన్స్ ఎన్‌ఆర్‌ఐ ఈక్విటీ ఫండ్‌లో 40 శాతం డివిడెండ్‌ను ఇవ్వనున్నామని సంస్థ సోమవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. మీడియా ఫండ్‌లో యూనిట్ ఒక్కింటికి 1.50 రూపాయలు, ఎన్‌ఆర్‌ఐ ఫండ్‌లో యూనిట్ ఒక్కింటికి 4 రూపాయలు అందుతాయని ఆర్‌ఎంఎఫ్ సిఇఓ సుందీప్ శిఖా వివరించారు.
- ఫండ్ వ్యాపారంలోకి శ్రేర :
- మూడు స్కీముల్లో డివిడెండ్ ప్రకటించిన రిలయన్స్ మ్యూచువల్స్
అనిల్ దీరూభాయ్ అంబానీ ఆధ్వర్యంలోని అతిపెద్ద మ్యూచువల్ ఫండ్ సంస్థ రిలయన్స్ మ్యూచువల్ ఫండ్ మూడు ఈక్విటీ స్కీముల్లో డివిడెండ్‌ను ప్రకటించింది. రిలయన్స్ బ్యాంకింగ్ ఫండ్, రిలయన్స్ ఫార్మా ఫండ్, రిలయన్స్ టాక్స్ సేవర్ ఫండ్స్‌లో డివిడెండ్లను అందిస్తున్నట్టు సంస్థ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. ఆగస్టు 28 నాటికి బ్యాంకింగ్ ఫండ్‌లో ముఖవిలువపై 20 శాతం, ఫార్మా ఫండ్‌లో 15 శాతం, టాక్స్ సేవర్ ఫండ్‌లో 15 శాతం డివిడెండ్‌ను అందించనున్నామని, దీంతో మొత్తం బ్యాంకింగ్ ఫండ్ ఖాతాదారులకు 160 శాతం, ఫార్మా ఫండ్ ఖాతాదారులకు 40 శాతం, టాక్స్ సేవర్ ఫండ్ ఖాతాదారులకు 40 శాతం డివిడెండ్ అందినట్టువుతుందని తెలిపింది. గడచిన ఆరు నెలల కాలంలో ఈ మూడు ఫండ్‌లు వరుసగా 66.85 శాతం, 60.40 శాతం, 60.52 శాతం వృద్ధిని నమోదు చేశాయని తెలిపింది. ప్రస్తుతం రిలయన్స్ మ్యూచువల్ ఫండ్ 56 స్కీములను నడుపుతుండగా, అందులో మొత్తం 71 లక్షల మంది పెట్టుబడులు పెట్ట ఉన్నారని, ఖాతాదారుల ప్రయోజనాలను కాపాడేందుకు కృషి చేయడమే తమ లక్ష్యమని సంస్థ ప్రకటించింది.
- సహారా మ్యూచువల్స్ నుంచి మరిన్ని ఫండ్స్
ఈ ఆర్థిక సంవత్సరంలోగా మరో మూడు డెబిట్, రెండు ఈక్విటీ ఫండ్స్‌ను మార్కెట్లోకి విడుదల చేయనున్నామని సహారా మ్యూచువల్ ఫండ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నరేష్ కుమార్ గార్గ్ వివరించారు. వీటితో పాటు రోజువారీ వేతనాలు పొందుతున్న వారికోసం డైలీ సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (ఎస్‌ఐపి)ను విడుదల చేస్తామని ఆయన తెలిపారు. ప్రస్తుతం సంస్థ మేనేజ్‌మెంట్ కింద 237 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని ఆయన వివరించారు. ఈ ఫండ్స్‌ను విడుదల చేసేందుకు కావలసిన అనుమతుల కోసం సెక్యూరిటీ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకు ఇప్పటికే డ్రాఫ్ట్ ఆఫర్ డాక్యుమెంట్లను అందించామని, త్వరలో అనుమతులు లభించే అవకాశాలున్నాయని ఆయన తెలిపారు. తొలి ఫండ్ మరో నెల రోజుల్లోగా ఇన్వెస్టర్లకు అందుబాటులోకి రావచ్చని అంచనా వేశారు. వీటిల్లో ముఖ్యమైంది సహారా డైలీ ఫండ్ అని, ఓపెన్ ఎండెడ్ విధానంలో 100 శాతం డెబిట్ స్కీమ్ ఫండ్‌లో ఎవరైనా 10 రూపాయల ప్రారంభమొత్తం నుంచి భాగస్వామ్యులు కావచ్చని వివరించారు. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థ దృఢత్వాన్ని సాధించే దిశగా అడుగులు వేస్తున్న ఈ తరుణంలో ఇటువంటి ఫండ్స్ భవిష్యత్‌లో మంచి రాబడులను అందిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 32 కోట్ల మందికిపైగా రోజువారీ వేతనాలను అందుకుంటున్నారని ప్రభుత్వ గణాంకాలు చూపుతున్నాయని, ఈ తరహా మైక్రో సేవింగ్ పథకాల ద్వారా వారికి లబ్ది కలుగుతుందని వ్యాఖ్యానించారు.