- అత్యుత్తమం -రిలయన్స్ ఫండ్:
జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో రిలయన్స్ మ్యూచువల్ ఫండ్ అత్యంత విజయవంతమైన ఫండ్‌గా అవతరించింది. క్రిసిల్ ప్రకటించిన కాంపోజిట్ పర్ఫార్మెన్స్ ర్యాంకింగ్స్(సీపీఆర్)లో ఈ ఫండ్ సంస్థ గరిష్ఠ ర్యాంకులు(10) సాధించడమే ఇందుకు కారణం. ఇక హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్ ఫండ్, ఐసీఐసీఐ ప్రుడెని్షయల్ మ్యూచువల్ ఫండ్ చెరో ఆరు సీపీఆర్‌లను పొంది తరువాతి స్థానంలో నిలిచాయి. బిర్లా సన్‌లైఫ్ ఎమ్‌ఎఫ్, డీఎస్‌పీ బ్లాక్‌రాక్ ఎమ్‌ఎఫ్, యూటీఐ ఎమ్‌ఎఫ్‌లు ఐదేసి చొప్పున సీపీఆర్‌లను పొందాయని క్రిసిల్ ఇక్కడ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో రిలయన్స్ ఎమ్‌ఎఫ్ చాలా మంచి పనితీరును ప్రదర్శించింది. ఎందుకంటే అంతక్రితం త్రైమాసికంలో ఈ సంస్థకు కేవలం నాలుగు సీపీఆర్‌లు మాత్రమే లభించడం గమనార్హం. రిస్క్ సమయాల్లోనూ మంచి ప్రతిఫలాలను అందించడంలో పైచేయిని సాధించడంతో పాటు ఈక్విటీ, లిక్విడ్, అల్ట్రా షార్ట్ టర్మ్ డెట్ వంటి పోర్ట్‌ఫోలియో అంశాల్లో మెరుగైన పనితీరే రిలయన్స్ ఎమ్‌ఎఫ్ ఆధిపత్యానికి కారణమైందని క్రిసిల్ ఫండ్ సేవల డైరెక్టర్ క్రిష్ణన్ సీతారామన్ పేర్కొన్నారు. ( సోర్సు: ఈనాడు )