• 27-10-2009
  • 33 శాతం రాబడి అందించిన ఎస్‌బిఐ ఫండ్‌

ఎస్‌బిఐ మాగ్నిమమ్‌ మల్టిప్లయర్‌ ప్లస్‌ (ఎంఎంపిఎస్‌) 1993 ఓపెన్‌-ఎండెడ్‌ ఈక్విటీ స్కీమ్‌ ఐదేళ్ళ కేటగిరిలో సెప్టెంబర్‌ చివరినాటికి 33.64శాతం రెవెన్యూ ఇచ్చింది. బిఎస్‌సి 100 ఇండెక్స్‌లో ఈ ఈక్విటీ స్కీమ్‌ అత్యుత్తమ ఫలితాలను కనబర్చిందని ఎస్‌బిఐ మ్యూచువల్‌ ఫండ్‌ మేనేజర్‌ జయేష్‌ షరాఫ్‌ తెలిపారు. ఈ స్కీమ్‌ లిక్విడిడీ సదుపాయంతో పాటు ఈ ఫండ్‌ను అనేక పోర్టుపోలియోల్లో పెట్టుబడులు పెట్టడంతో ఆదాయం ఇవ్వడమేగాక దీని విలువ కూడా గణనీయంగా పెరిగేందుకు అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ ఫండ్‌ ఎసెట్‌ అండర్‌ మేనేజ్‌మెంట్‌ (ఎయుఎం) 1054.39 కోట్ల రూపాయలకు చేరుకోగా, సెప్టెంబర్‌లోనే 51.83కోట్ల రూపాయలు పెరిగిందని ఆయన తెలిపారు. ఈ ఫండ్‌ను స్టాక్‌ మార్కెట్‌లో లాభదాయకమైన షేర్లలో ఇన్వెస్ట్‌ చేసినట్లు తెలిపారు. ముఖ్యంగా బిహెచ్‌ఇఎల్‌, క్రాప్టన్‌ గ్రీవ్స్‌, స్టెర్‌లైట్‌ ఇండస్ట్రీస్‌, లుపిన్‌, ఎస్‌బిఐ ఇన్వెస్ట్‌ చేస్తున్నట్లు ఎస్‌బిఐ మ్యూచువల్‌ ఫండ్‌ సిఐఓ నవనీత్‌ మునాట్‌ తెలిపారు. అధిక వృద్ధిరేటు సాధించే కంపెనీల్లో ఈ స్కీమ్‌ నిధులు ఇన్వెస్ట్‌ చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. దీర్ఘకాలంలో ఈ ఫండ్‌ మరింత ఫలితానివ్వగలదని ఆయన ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.