- 'ఇండియా వాల్యూ ఫండ్'ను విడుదల చేసిన ఫెడిలిటీ
దీర్ఘకాలంలో పెట్టుబడులకు మరింత రాబడి, భద్రతను అందించే లక్ష్యంతో 'ఇండియా వాల్యూ ఫండ్'ను మార్కెట్లోకి విడుదల చేశామని ఫెడిలిటీ మ్యూచువల్ ఫండ్ ప్రకటించింది. ఒపెన్ ఎండెడ్ ఫండ్‌గా దీన్ని ప్రవేశపెట్టామని, ఎన్‌ఎఫ్‌ఓ డిసెంబర్ 15 వరకూ తెరచివుంటుందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఆశు సుయాష్ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఈ ఫండ్ రాకతో తాము అందిస్తున్న ఈక్విటీ ఫండ్ల సంఖ్య మరింతగా పెరిగిందని, ఎన్నుకోవడానికి కస్టమర్లకు మరింత సౌలభ్యం లభించిందని ఆయన వ్యాఖ్యానించారు. వృద్ధి బాటన నడుస్తున్న ఆర్థిక వ్యవస్థలో విలువ ఆధారంగా పెట్టుబడులు పెడితే భవిష్యత్‌లో మంచి రాబడులు వస్తాయని ఫండ్ మేనేజర్ నితిన్ బజాజ్ వ్యాఖ్యానించారు.