18-2-2010
- ఫిడిలిటీ టాక్స్ అడ్వాంటేజ్ ఫండ్‌కు అవార్డులు
ఫిడిలిటి ఎంఎఫ్ నిర్వహిస్తున్న టాక్స్ అడ్వాంటేజ్ ఫండ్‌కు 2010 సంవత్సరానికిగాను రెండు ప్రతిష్ఠాత్మక అవార్డులు లభించాయి. సిఎన్‌బిసి టివి 18 క్రిసిల్ సంయుక్తంగా ప్రకటించిన అవార్డుల్లో ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్ కేటగిరీలో మ్యూచువల్ ఫండ్ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో పాటు ఐసిఆర్‌ఎ 7 స్టార్ గోల్డ్ అవార్డును ఫండ్ సొంతం చేసుకుంది. ఈ అవార్డు లభించడం తమకు ఎంతో గర్వకారణమని ఫిడిలిటీ ఇంటర్నేషనల్ ఎండి ఆశు సుయాష్ బుధవారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. దీర్ఘకాలానికి ఇన్వెస్టర్లకు అత్యంత సంతృప్తికరమైన రాబడులను అందించే మరిన్ని ఫండ్‌లకు రూపకల్పన చేస్తామని ఆయన వివరించారు.
- 20 శాతం డివిడెండ్ ప్రకటించిన టారస్ ఎంఎఫ్
టారస్ మ్యూచువల్ ఫండ్ హౌస్ నిర్వహిస్తున్న టారస్ ఎథికల్ ఫండ్‌లో ప్రతి రెండు రూపాయల ముఖ విలువ ఉన్న వాటాలపై 20 శాతం డివిడెండ్‌ను అందిస్తున్నట్టు సంస్థ బుధవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. డివిడెండ్ రికార్డు తేదీని ఈ నెల 19గా నిర్ణయించామని, ఫండ్ ఏప్రిల్ 2009లో ఆరంభం కాగా, ఇప్పటికే 100 శాతానికి పైగా రిటర్న్స్ వచ్చాయని తెలిపింది. గత సంవత్సరం జూలైలో 15 శాతం, సెప్టెంబర్‌లో 10 శాతం డివిడెండ్‌ను ప్రకటించామని తెలిపింది.