• 7-2-2010
  • కాపిటల్‌ ప్రొటెక్షన్‌ ఓరియంటెడ్‌ ఫండ్‌ను విడుదల చేసిన బిర్లా సన్‌ లైఫ్‌
పెట్టిన పెట్టుబడికి రక్షణ కల్పిస్తూ వృద్ధిని అందించే 27 మాసాల క్లోజ్‌ ఎండెడ్‌ ఫండ్‌ 'బిఎస్‌ఎల్‌ కాపిటల్‌ ప్రొటెక్షన్‌ ఓరియంటెడ్‌ ఫండ్‌ సిరీస్‌-1'ను విడుదల చేస్తున్‌నట్టు బిర్లా సన్‌ లైఫ్‌ మ్యూచువల్‌ ఫండ్‌ ప్రకటించింది. కనీసం 5 వేల రూపాయల పెట్టుబడితో ఫండ్‌లో ప్రవేశించవచ్చని, ఈ ఫండ్‌కు ప్రముఖ రేటింగ్‌ ఏజన్సీ క్రిసిల్‌ ట్రిపుల్‌ ఎ రేటింగ్‌ను ఇచ్చిందని బిఎస్‌ఎల్‌ఎఎంసి సిఇఒ ఎ బాలసుబ్రమణియన్‌ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. యూనిట్లను కాలపరిమితి తీరిన తరువాత మాత్రమే మార్చుకోవచ్చని స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లలో లిస్టింగ్‌ సదుపాయం ఉందని ఆయన వివరించారు