• 24-2-2010
  • అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కార్యకలాపాలు ఆరంభించిన ఎల్‌అండ్‌టి
టెక్నాలజీ, ఇంజనీరింగ్‌, కన్‌స్ట్రక్షన్‌ రంగాల్లో గుర్తింపు పొందిన ఎల్‌అండ్‌టి అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కార్యకలాపాలను అధికారికంగా ఆరంభించింది. ఈ ఎఎంసికి ఎల్‌షండ్‌టి ఇన్వెస్ట్‌ మెంట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ లిమిటెడ్‌ అని పేరు మార్చామని, ఫండ్‌ హౌస్‌ విభాగానికి ఎల్‌అండ్‌టి మ్యూచువల్‌ ఫండ్‌ అని నామకరణం చేశామని సంస్థ సోమవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం ఫండ్‌ హౌస్‌ వద్ద 2,634 కోట్ల రూపాయల ఎయుఎం (అసెట్స్‌ అండర్‌ మేనేజ్‌మెంట్‌) ఉన్నదని, ఈక్విటీ, ఫిక్స్‌డ్‌ ఇన్‌కం, లిక్విడ్‌ ఫండ్స్‌లో 18 స్కీములను నిర్వహిస్తున్నామని ఎల్‌అండ్‌టి చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌, హోల్‌ టైమ్‌ డైరెక్టర్‌ వైఎం డియోస్థలీ మీడియాకు వివరించారు.