• 1-3-2010
  • 18 శాతం రాబడుల లక్ష్యంతో త్వరలో 'గుజరాత్‌ ఇన్‌ఫ్రా ఫండ్‌'

పారిశ్రామికంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న గుజరాత్‌ రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పన కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం 5 వేల కోట్ల రూపాయల నిధుల సేకరణ లక్ష్యంగా గుజరాత్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫండ్‌ను విడుదల చేయనుంది. ఈ నిధులను భవిష్యత్‌లో గుజరాత్‌లో ఏర్పడే టెక్నాలజీ, బయోటెక్‌, స్మాల్‌, మీడియం కంపెనీలతో పాటు నానో టెక్నాలజీ ప్రాజెక్టుల్లో పెట్టుబడులుగా పెట్టనున్నామని, గుజరాత్‌ వెంచర్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ ఫండ్‌ను మేనేజ్‌ చేస్తుందని అక్కడి ప్రభుత్వాధికారులు తెలిపారు. ప్రస్తుత రాష్ట్ర బడ్జెట్‌లో ఇన్‌ఫ్రా ఫండ్‌ ఏర్పాటు దిశగా 5 కోట్ల రూపాయలను కేటాయించామని వివరించారు. ఏప్రిల్‌ 2010 నుంచి ఫండ్‌ కార్యకలాపాలు ఆరంభించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని, పెట్టుబడులపై కనీసం 18 నుంచి 21 శాతం రాబడులను అందించేలా రూపొందిస్తున్నామని వివరించారు.