ఆగస్ట్ 1 విడుదల
మ్యూచువల్ ఫండ్లు ఇక పై తామూ ఆకర్షిస్తున్న పెట్టుపడుల పై ఆగస్ట్ 1 తేది నుండి ఎటువంటి entry load వేయరాదని SEBI ప్రకటించింది. ఐతే ఫండ్ హౌస్లు మాత్రం 1 % విస్తరణ, ప్రాచారం,కమీషన్ ల నిమిత్తం EXIT LOAD వసూలు చేయవచ్చని స్పష్టం చేసింది. ఇక పెట్టుపడి దారుడు స్వయం గానే తమ దిస్ట్రిబ్యుటర్ నకు పారితోషకం అందజేయ వలసి వస్తుంది
25-06-2009
రిలయన్స్ ఎసెట్ సీఈఓగా షేక్ చీ సేంగ్
రిలయన్స్ ఎసెట్ మేనేజ్‌మెంట్(సింగపూర్) ప్రైవేట్ లిమిటెడ్‌కు ప్రధాన కార్యనిర్వహణాధికారిగా షేక్ చీ సేంగ్‌ను అనిల్ ధీరూభాయ్ అంబానీకి చెందిన రిలయన్స్ క్యాపిటల్ లిమిటెడ్ సంస్థ గురువారం నియమించింది. షేక్ చీ సేంగ్‌ను రిలయన్స్ ఎసెట్ మేనేజ్‌మెంట్ల్ ప్రధాన కార్యనిర్వహణాధికారిగా నియమిస్తున్నట్లు రిలయన్స్ క్యాపిటల్ ప్రధాన కార్యనిర్వహణాధికారి మరియు అంతర్జాతీయ బిజినెస్ అధ్యక్షుడు విక్రాంత్ గుగ్నానీ గురువారం ముంబైలో తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... షేక్ ఆగ్నేయాసియా మరియు చైనా దేశాలలో ఆర్థికపరమైన సేవలందించడంలో 23 సంవత్సరాల అనుభవం ఉందని ఆయన షేక్‌ను కొనియాడారు. గతంలో ఆయన సీటెక్ ప్రధాన కార్యనిర్వహణాధికారిగా ఉన్నారు. ఇదిలావుండా రిలయన్స్ ఎసెట్ మేనేజ్‌మెంట్ ద్వారా రిలయన్స్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పరమైన వ్యాపార సేవలను కొనసాగించి మరింత విస్తరిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.