1-12-2009
ఎన్‌ఎస్‌ఇతో యుటిఐ ఒప్పందం
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌తో యుటిఐ మ్యూచువల్ ఫండ్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా, దేశవ్యాప్తంగా యుటిఐకి ఉన్న ఇన్వెస్టర్ల కుటుంబానికి నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ టర్నినళ్ళ ద్వారా లావాదేవీలు నడుపుకునే సౌకర్యం కలుగుతుందని యుటిఐ అసెట్ మేనేజ్‌మెంట్ సిఎండి యుకె సిన్హా సోమవారం నాడు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఒక ఫండ్ సంస్థ తమ ఇన్వెస్టర్లకు ఈ తరహా ప్రయోజనాన్ని కల్పించడం ఇదే తొలిసారని ఆయన తెలిపారు. నేషనల్ ఎక్స్ఛేంజ్‌కి దేశవ్యాప్తంగా 1500 నగరాలు, పట్టణాల్లో సుమారు 1.5 లక్షల టర్మినళ్ళు ఉన్నాయని, వాటన్నింటి ద్వారా యుటిఐ ఇన్వెస్టర్ల లావాదేవీలు కొనసాగనున్నాయని ఎన్‌ఎస్‌ఇ ఎండి రవి నారాయణ్ వివరించారు.