• 23-11-2009
  • 50 శాతం డివిడెండ్‌ను ప్రకటించిన రిలయన్స్‌ విజన్‌ ఫండ్‌

అనిల్‌ దీరూభాయ్‌ అంబానీ గ్రూపు సంస్థ రిలయన్స్‌ మ్యూచువల్‌ ఫండ్‌ హౌస్‌లోని ఆర్‌ విజన్‌ ఫండ్‌హోల్డర్లకు 50 శాతం డివిడెండ్‌ను ప్రకటించినట్టు సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ఓపెన్‌ ఎండెడ్‌ ఫండ్‌గా, రిటైల్‌, ఇన్‌స్టిట్యూషనల్‌ స్కీమ్‌ కింద మార్కెట్‌కు వచ్చిన విజన్‌ ఫండ్‌ స్వల్ప కాలంలోనే మంచి ప్రతిభ కనబరిచిందని ఈ సందర్భంగా రిలయన్స్‌ కామిటల్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ లిమిటెడ్‌ సిఇఒ సందీప్‌ శిఖా వ్యాఖ్యానించారు. నవంబర్‌ 27 నాటికి ప్రతి 10 రూపాయల ముఖ విలువ ఉన్న యూనిట్‌లపై 5 రూపాయలను చెల్లించనున్నామని తెలిపారు. ఫండ్‌ డివిడెండ్‌ ప్లాన్‌ కింద నవంబర్‌ 20 వరకూ 46.3236, రిటైల్‌ అండ్‌ ఇన్‌స్టిట్యూషనల్స్‌కు 226.091 రూపాయల నెట్‌ అసెట్‌ వాల్యూ వుందని సందీప్‌ శిఖా వివరించారు