• 27-12-2009
  • ఫండ్‌ల వ్యాపారంలోకి యూనియన్‌ బ్యాంక్‌
వచ్చే ఆర్థిక సంవత్సరంలో మ్యూచువల్‌ ఫండ్‌(ఎంఎఫ్‌) రంగంలోకి అడుగిడనున్నట్లు యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(యూబీఐ) కార్యనిర్వాహక డైరెక్టర్‌ ఎస్‌.సి.కలియా శనివారం బెంగళూరులో చెప్పారు. ఇందుకు అవసరమైన అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ(ఏఎమ్‌సీ) ఏర్పాటు ఇప్పటికే పూర్తయిందని రానున్న ఏడాదిలో ప్రారంభించడమే తరువాయి అని విలేకరులకు చెప్పారు. అంతర్జాతీయ ఆర్థిక మాంద్యం ప్రభావం సంస్థపై ఎలాంటి ప్రభావమూ చూపలేదన్నారు.