• 6-2-2010
  • వూరి ఇన్వెస్ట్‌మెంట్స్‌తో ఆదిత్య బిర్లా ఫైనాన్స్‌ ఒప్పందం

నాన్‌-బ్యాంకింగ్‌ సర్వీసుల్లో పేరుగాంచిన ఆదిత్య బిర్లా ఫైనాన్స్‌ సర్వీసెస్‌ గ్రూప్‌ దక్షిణ కొరియాకు చెందిన వూరి ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ సెక్యూరిటీస్‌తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ రెండు సంస్థలు తమ ప్రాడక్టులను భారత్‌, కొరియా దేశాలలో మార్కెట్‌ చేసేందుకు అనువుగా ఒప్పందం దోహదపడుతుంది. భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు 50 కోట్ల డాలర్లను విదేశీ మార్కెట్‌ నుంచి సేకరించేందుకు వూరి సంస్థ తమకు సహకరించనుందని ఆదిత్య బిర్లా ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆజయ్‌ శ్రీనివాసన్‌ పేర్కొన్నారు. వూరి సంస్థ తమతో భాగస్వామ్యం కావడంతో దేశంలోని తమ ఖాతాదారులకు మరిన్ని సర్వీసులు అందించనున్నామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. విదేశాలలో మ్యూచువల్‌ ఫండ్‌, రియల్‌ ఎస్టేట్‌ ఫండ్స్‌, బిజినెస్‌ నిధులు మరింతగా సేకరించే అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు. తమ సంస్థ మార్కెట్‌ను చైనా, రష్యా, వియత్నాం, భారత్‌లకు విస్తరించేందుకు ఈ ఒప్పందం దోహదం చేస్తుందని వూరి ఇన్వెస్టిమెంట్‌ సిఇవో సంఘ్‌ హో హాంగ్‌ పేర్కొన్నారు.